క్రీడలతోనే శారీరక దారుఢ్యం : బీసీ సంఘం అధ్యక్షులు గుజ్జరీ రాఘవేందర్

by Ratna Kumari |

గ్రామీణ ప్రాంతాల్లోని యువత పెడదారిన పడకుండా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే శారీర దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తలకొండపల్లి మండల బీసీ సంఘం అధ్యక్షులు గుజ్జరీ రాఘవేందర్ అన్నారు.

క్రీడలతోనే శారీరక దారుఢ్యం : బీసీ సంఘం అధ్యక్షులు గుజ్జరీ రాఘవేందర్
X

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాల్లోని యువత పెడదారిన పడకుండా క్రీడలపై ప్రత్యేక దృష్టి పెడితే శారీర దారుద్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తలకొండపల్లి మండల బీసీ సంఘం అధ్యక్షులు గుజ్జరీ రాఘవేందర్ అన్నారు. మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ కు బీసీ సంఘం అధ్యక్షులు రాఘవేందర్ ముఖ్య అతిథులుగా హాజరై 100మంది క్రీడాకారులకు సుమారు 80 వేల విలువచేసే యూనిఫార్మ్స్ విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రాఘవేందర్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా గత ఆరేడు సంవత్సరాలుగా క్రీడాకారులకు నా వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నానని తెలిపారు. ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నన్ని రోజులు నా యొక్క సహాయ సహకారాలు గ్రామం పై ఉంటాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కానుగుల అనిత మల్లేష్, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుమ్మరి శంకర్, ఉప సర్పంచ్ వెంకటేష్, వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేష్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, వాడు సభ్యులు లక్ష్మయ్య, రాము, కిరణ్, రాజు, రాజశేఖర్, శ్రీను పాల్గొన్నారు.

Next Story