ఫ్లెక్సీ లో బీసీ నాయకుల ఫోటోలు లేకుండా 'ఫూలే' జయంతి వేడుకలా?

by Nallavelli.Anjaneyulu |

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శనివారం అధికారికంగా నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లలో జిల్లా బీసీ నాయకుల ఫోటోలు లేకపోవడం బీసీ లను అవమానించడమేనని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ గౌడ్ విమర్శించారు.

ఫ్లెక్సీ లో బీసీ నాయకుల ఫోటోలు లేకుండా ఫూలే జయంతి వేడుకలా?
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని శనివారం అధికారికంగా నిర్వహించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లలో జిల్లా బీసీ నాయకుల ఫోటోలు లేకపోవడం బీసీ లను అవమానించడమేనని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణ గౌడ్ విమర్శించారు. స్థానిక పద్మావతీ కాలనీలోని గ్రీన్ బెల్ట్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే జయంతీ సందర్భంగా అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ఆయన ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లలో బీసీ నాయకుల ఫోటోలు లేకపోవడం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి మాట్లాడారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం వారు జిల్లా కలెక్టర్ పేర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లలో బీసీ అయిన రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, నగర మేయర్ మమత, ముడా చైర్మెన్ లక్ష్మణ్ యాదవ్ ల ఫోటోలు పెట్టకపోవడం వెనుక బీసీ లను అణగదొక్కాలనే ఆలోచన కనిపిస్తుందని ఆయన ఆరోపించారు. బీసీ ల పట్ల వివక్ష చూపిన అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Next Story