పెట్రోల్ బంక్ లు లేక అవస్ధలు

by Ratna Kumari |

యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ షార్టేజ్ ఏమో కానీ, 3 లక్షల జనాభా దాటిన మహబూబ్ నగర్ పట్టణంలో సరైన పెట్రోల్ బంక్ లు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పెట్రోల్ బంక్ లు లేక అవస్ధలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ షార్టేజ్ ఏమో కానీ, 3 లక్షల జనాభా దాటిన మహబూబ్ నగర్ పట్టణంలో సరైన పెట్రోల్ బంక్ లు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్ నగర్ పాత బస్ స్టాండ్ లో ఆర్టీసీ యాజమాన్యం ఏర్పాటు చేసిన పెట్రోల్, డిజిల్ బంక్, అలాగే అతిపెద్ద కాలనీలైన పద్మావతి, వెంకటేశ్వర, శ్రీనివాస కాలనీలలో ఉన్న మూడు పెట్రోల్ బంక్ లకు గాను రెండు బంకులు, అలాగే రిలయన్స్ పెట్రోల్ బంకు, పాత పాలమూరు లో ఒక బంకు ఇలా పూర్తి స్థాయిలో పై బంకులు మూతపడడంతో ఆయా ఏరియాలోని ఆటోలు, ద్విచక్ర, ఫోర్ వీలర్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహబూబ్ నగర్ మున్సిపాల్టీ నుండి కార్పొరేషన్ గా అవతరించినా కూడా పట్టణానికి సరిపడ్డ పెట్రోల్, డీజిల్ బంకులు లేకపోవడం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల పని తీరుకు అద్దం పడుతుంది. వెంటనే మూతపడ్డ పెట్రోల్ బంకులను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story