- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్వచ్ఛమైన తాగునీటితో సంపూర్ణ ఆరోగ్యం
స్వచ్ఛమైన తాగునీటితో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని సర్పంచ్ సత్తూరి నాగలక్ష్మీ నరేందర్ గౌడ్ అన్నారు.

దిశ, పాన్ గల్ : స్వచ్ఛమైన తాగునీటితో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని సర్పంచ్ సత్తూరి నాగలక్ష్మీ నరేందర్ గౌడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటి ప్యూర్ వాటర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వచ్చమైన నీళ్లు తాగి అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. విద్యార్థులకు సంస్థ నుంచి ఇచ్చిన వాటర్ బాటిల్స్ సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ పిల్లలు స్వచ్చమైన శుద్ధి చేసిన నీరు తాగినప్పుడే ఆరోగ్యంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారన్నారు. సంస్థ నుంచి 140 మంది విద్యార్థులకు వాటర్ బాటిల్లు అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ, ఎంపీడీవో గోవింద రావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగ లీల, ప్లాంట్ సివిల్ వర్క్ నిర్వహణ ధాత రాము యాదవ్, కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ ప్రతినిధులు ముజీబ్ ప్రకాష్, శేఖర్ పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్ యాదవ్, వెంకటనారాయణ పాల్గొన్నారు.





