యుద్ధం వద్దు.. శాంతి ముద్దు

by Ratna Kumari |

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో యుద్ధం వద్దు.. శాంతి ముద్దు ప్రపంచానికి ప్రజలందరూ తెలియజేయాలని పీపుల్స్ సొసైటీ దళిత సంఘాలు, మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ చైతన్య అధ్యక్షతన విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు.

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో యుద్ధం వద్దు శాంతి ముద్దు ప్రపంచానికి ప్రజలందరూ తెలియజేయాలని పీపుల్స్ సొసైటీ దళిత సంఘాలు మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ చైతన్య అధ్యక్షతన విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. యుద్ధం వల్ల ప్రపంచంలోని ప్రజలందరూ పెట్రోల్, నిత్యవసర ధరలు పెరిగి అందరూ ఇబ్బంది పడతారని, ఒక దేశం పట్ల ఇంకొక దేశానికి శాంతి నెలకొలపాలని, ఐక్యరాజ్యసమితి జోక్యం.. చేసుకోవాలని కోరారు. ఇదే రకమైనటువంటి యుద్ధం జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని దళిత సంఘాల, మైనార్టీ నేతలు హెచ్చరించారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు ప్రతి ఇంట్లో ప్రపంచంలో జరిగే యుద్ధం గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని, అందరూ ఆందోళన చేయాలని, యుద్ధం ఆపాలని డిమాండ్ చేయాలని కోరారు. ఇరాక్ ఫై అమెరికా గల్ఫ్ దేశాలను అడ్డుపెట్టుకొని ట్రంప్ స్వార్థ ప్రయోజనాల కోసం పెట్రోల్ దోచుకోవడం కోసం..ఇతర దేశాల పట్ల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం దుర్మార్గం అన్నారు. దుర్మార్గులు చేస్తున్న యుద్ధం యావత్ ప్రపంచ జాతి ఇబ్బందులకు గురి చేస్తున్న ట్రంపున‌కు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని తీర్మానించారు.

Next Story