- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజల చిరకాల స్వప్నం సహకారం : బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు
దిశ, వనపర్తి : కేంద్ర క్యాబినెట్ సమావేశంలో వనపర్తి జిల్లాకి కేంద్రీయ విద్యాలయం ప్రకటించడంతో వనపర్తి ప్రజల కల సహకారం కానుందని బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

బడుగు బలహీన వర్గాల పిల్లలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రీయ విద్యాలయం కోసం మేమే కృషి చేశామని కొందరు ప్రజలకు తప్పుడు సంకేతాలు సోషల్ మీడియా, వార్తాపత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు వీటిని ఖండిస్తున్నామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులలాలలో ఎందుకు పెడుతూ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయాని ప్రశ్నించారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఎందుకు విడుదల చేస్తలేరని,.. రాష్ట్రంలో విద్యాశాఖమంత్రి నియమించలేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై కపట ప్రేమ చూపిస్తు,విద్యార్థుల సమస్యలకు పరిష్కరించడంలో విఫలమైదని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి వల్లనే వనపర్తి జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు అయిందని స్పష్టం చేశారు. మాజీ జడ్పీటీసీ లోక్ నాథ్ రెడ్డి, బీజేపీ జిల్లా కోశాధికారి కుమారస్వామి, ఆఫీస్ సెక్రెటరీ ఆకుపోకు కుమార్, మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్, పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్, ఐటీ సెల్ కన్వీనర్ అంజి, పట్టణ ప్రధాన కార్యదర్శి అరవింద్, మాజీ ప్రధాన కార్యదర్శి రాయన్న, విజయ్, ఉపాధ్యక్షులు అంజి, పవన్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు రవి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు చాణిక్య చెన్న రాయుడు పాల్గొన్నారు.






