- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా తీర్పు.. మా ప్రభుత్వ పాలనకు నిదర్శనం..!
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, ఈ ఫలితాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

దిశ, కొల్లాపూర్ : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని, ఈ ఫలితాలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొల్లాపూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఎన్నికలైనా విజయం కాంగ్రెస్‌దేనని మరోసారి రుజువైందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ప్రజలు మాకు పట్టం కట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి జూపల్లి ఉద్ఘాటించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడం ప్రజలు ప్రభుత్వ పాలన పట్ల ఎంత సంతృప్తిగా ఉన్నారో చెబుతోందన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ మొత్తం 19 స్థానాలకు గాను 16 స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని చెప్పారు. ఇది పార్టీ శ్రేణుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని కొనియాడారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన విమర్శలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, వారి తీర్పుతో ప్రతిపక్షాలకు తగిన గుణపాఠం చెప్పారని జూపల్లి వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఫలితాల ఊపు రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని, అక్కడ కూడా ప్రజలు ఇదే తరహా తీర్పును ఇవ్వబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.






