ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ రామ్ లాల్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఊట్కూర్ : ప్ర‌జ‌లు మత్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సీఐ రామ్ లాల్ సూచించారు. మండ‌ల ప‌రిధిలోని పెద్ద‌జెట్రం గ్రామాన్ని సీఐ రామ్ లాల్, ఎస్సై ర‌మేష్ సంద‌ర్శించారు.

ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి : సీఐ రామ్ లాల్
X

దిశ‌, ఊట్కూర్ : ప్ర‌జ‌లు మత్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సీఐ రామ్ లాల్ సూచించారు. మండ‌ల ప‌రిధిలోని పెద్ద‌జెట్రం గ్రామాన్ని సీఐ రామ్ లాల్, ఎస్సై ర‌మేష్ సంద‌ర్శించారు. ఎస్పీ వినీత్ సూచ‌న మేర‌కు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సీఐ రామ్ లాల్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు.. అక్రమాలు బెదిరింపులు.. ప్రలోభాలు పెడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గ్రామాలలోని ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. ప్రజలందరూ కలిసి మెలిసి సోదర భావంతో ఉండాలని కోరారు. అనంతరం శాంతి భద్రతల పరిస్థితులు, మత్తు పదార్థాలు, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అవగాహన కల్పించారు. గ్రామ ప్రజల సమస్యలను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

Next Story