- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించాలి : జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత
ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగిస్తూ, న్యాయ సేవలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత పారా లీగల్ వాలంటరీలదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగిస్తూ, న్యాయ సేవలను గ్రామీణ స్థాయికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూసే బాధ్యత పారా లీగల్ వాలంటరీలదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సూచించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఇందిర అధ్యక్షతన పారా లీగల్ వాలంటరీ లకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లీగల్ ఎయిడ్, అగ్రీ లీగల్ ఎయిడ్ క్లీనిక్ లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీలు అందిస్తున్న న్యాయ సేవలు మరింత మెరుగైన స్థాయిలో అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో పేదలకు న్యాయం సరైన విధంగా అందడం లేదని ఎన్నో నివేదికలు చెబుతున్నాయని, పారా లీగల్ వాలంటరీలు తమ దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందించి ఇరువురి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. గ్రామీణ,మండల స్థాయిలో న్యాయ సేవలు విస్తరించేందుకు పారా లీగల్ వాలంటరీల కృషి ఎక్కువగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు కృష్ణ, డిసిపిఓ నర్మద, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అల్తాఫ్, జేజేబి సభ్యులు, సోషల్ వర్కర్, పిఎల్వీ చంద్రశేఖర్, శివ్వన్న పంతులు చట్టాలపై అవగాహన కల్పించారు.






