- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు అష్టఐశ్వర్యాలతో తులతూగాలి
శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ప్రజలు సుఖశాంతులు,అష్టఐశ్వర్యాలతో తులతూగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శి

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: శ్రీ విశ్వావసు నామ సంవత్సర సందర్భంగా ప్రజలు సుఖశాంతులు,అష్టఐశ్వర్యాలతో తులతూగాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. శిల్పారామంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణము కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణ కర్త శ్రావణ్ కుమార్ పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో ఏ పండగలు,వేడుకలు,పర్వదినాలైనా భక్తి శ్రద్ధలతో సోదరభావంతో కలిసి మెలిసి ఘనంగా నిర్వహించుకోవాలని,ఈ ఉగాది అందరికీ విజయాలను,కీర్తిని అందించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వివిధ రంగాల్లో విశిష్ట సేవలదించిన ప్రముఖులు న్యాయవాది మనోహర్ రెడ్డి,డాక్టర్ శామ్యూల్,నటరాజ్,పాండురంగం,చెన్నవీరయ్య,బాగన్న గౌడ్,శీనయ్య శెట్టి,రాంచదర్ నాయక్,సిర్రా నారాయణ,రఫీక్ అహ్మద్ పటేల్,మురళీధర్ రావు వేణుగోపాల్ లను శాలువతో కప్పి ఘనంగా సన్మానించారు. తర్వాత ఉగాది పచ్చడిని అతిథులతో కలిసి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి,ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్,మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత,జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు ఎన్పీ వెంకటేష్,టీపిసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్,సత్తూర్ చంద్రకుమార్ గౌడ్,సిరాజ్ ఖాద్రీ,మహేందర్,సుధాకర్ రెడ్డి,మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,1టౌన్ సీఐ అప్పయ్య,తదితరులు పాల్గొన్నారు.






