- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెన్షనర్ల హెల్త్ కార్డుల కోసం తమ వివరాలు పంపక్కర్లేదు
రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ హెల్త్ కార్డుల కోసం తమ వివరాలు పంపక్కర్లేదని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ హెల్త్ కార్డుల కోసం తమ వివరాలు పంపక్కర్లేదని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి బి.ప్రహ్లాద్ రావు, యం.శంకర్ రెడ్డి లతో తెలంగాణ రాష్ట్ర ట్రైజరరీ డైరెక్టర్ పార్వతీదేవి ని కలిసి పెన్షనర్ల హెల్త్ కార్డులు, నగదు రహిత చికిత్స విషయమై చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలో భాగంగా వృద్ధులైన పెన్షనర్ల వివరాలు ఆరోగ్యశాఖ నుండి ప్రభుత్వమే తెప్పించుకుంటుందని ఆమె తెలిపినట్లు ఆయన వివరించారు. మన బేసిక్ పే లో 1.5 శాతం నగదును మినహాయించుకొని అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికెట్లను ఆలస్యంగా పంపినవారికి కూడా 31 లోపు వారి వారికి పెన్షన్ లను అందజేయనున్నట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.






