ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి : జలసాధన కమిటీ

by Nallavelli.Anjaneyulu |

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పనులను జలసాధన జేఏసీ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించి యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని జలసాధన కమిటీ అన్నారు.

ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేయాలి : జలసాధన కమిటీ
X

దిశ‌, మ‌క్త‌ల్ : ఉమ్మడి జిల్లాలో పెండింగ్ లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పనులను జలసాధన జేఏసీ ఆదివారం మధ్యాహ్నం పరిశీలించి యుద్ధ ప్రాతి పదికన పూర్తి చేయాలని జలసాధన కమిటీ అన్నారు. మొక్కల్లోనే ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కొత్తగా నిర్మించే రోడ్ కం బ్యారేజీలు లను సర్వేలు చేసి అనువైన స్థలాలను గుర్తించి ఈ ప్రాంతానికి సాగు తాగునీరు అందించేలా త్వరగా పూర్తి చేయాలని పాలమూరు కరువు జిల్లా పేరును రూపుమాపేలా ప్రభుత్వం పని చేయాలని. కృష్ణా నదిలో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను తీసుకొని ఈ ప్రాంతాన్ని భూముల కు సాగు నీరు అందించి సస్యాశ్యామలంగా చేయాలని జలసాధన జె.ఎ.సి. నాయకులు అన్నారు.

నియోజకవర్గం లో మండలంలోని కాట్రపల్లి దగ్గర కొనసాగుతున్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పనులను జలసాధన నాయకులు పరిశీలించారు. ఓడి పేరున పాలమూరు రంగారెడ్డి పథం నీటిని దొంగచాటుగా నల్గొండకు తరలించుకపొవడాన్ని ఏమాత్రం సహించేది లేదన్నారు. కృష్ణా, భీమానదూలపై అనువైన చోటల్లా రొడ్డు కం బ్యారేజీలు నిర్మించాలని కోరారు. పాలమూరు జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులని యుద్ధప్రాతిపాదికన పూర్తి చేయకపోతే ప్రస్తుత పాలక ప్రభుత్వం ప్రజా ద్రోతలుగా మిగిలిపోతారని హెచ్చరించారు. భీమానది సంగమం క్రింద కర్ణాటక ప్రభుత్వంలో చర్చించి పెద్ద ఆనకట్ట నిర్మించి అవసరమైనన్ని నీళ్ళు ఎత్తి పోకి మహబూబ్ న‌గర్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని ప్రాంతాలకు నీరందించాలని కో చైర్మన్ ఎం. రాఘవ చారి ప్రభుత్వానికి ఒక ప్రతిపాదనను సూచించారు. ప్రాజెక్టులు పూర్తి చేసేవరకు ప్రజలతో కలిసి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా జేఏసీ రాఘచారి, బెక్కం జనార్దన్, కిష్ఠన్న, సూర్యప్రకాశ్ద, త్తాత్రేయ, కేసీ వెంకటేశ్వర్లు, పరమేష్, ఎం.డీ. అనీఫ్ పాల్గొన్నారు.

Next Story