- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేరుశనగ మాయాజాలం, 506 క్వింటాళ్ల ఉచిత కోటా ‘స్వాహా’?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎంఈవో- ఓఎస్ పథకాన్ని దౌల్తాబాద్ మండల అధికారులు అక్రమార్జనకు దారిగా మా ర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేరుశనగ మాయాజాలం, 506 క్వింటాళ్ల ఉచిత కోటా ‘స్వాహా’?
l ఒక క్వింటాల్ ఇస్తే.. రెండు క్వింటాళ్లు ఇచ్చినట్లు రికార్డుల్లో గారడీ!
l లబ్ధిదారుల జాబితాలో
విత్తనాలు తీసుకోని వారి పేర్లు!
l జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ
జరిపించాలని రైతుల డిమాండ్
దిశ, కొడంగల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ ఎంఈవో- ఓఎస్ (నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్-ఆయిల్ సీడ్స్) పథకాన్ని దౌల్తాబాద్ మండల అధికారులు అక్రమార్జనకు దారిగా మా ర్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి అధికారులు సమర్పించిన అధికారిక రికార్డులకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దోపిడీకి అస్సలు పొంతన లేదని తెలిసింది. ఆర్టీఐ ద్వారా బయటపడ్డ వివరాల ప్రకారం.. ఈ కుంభకోణం కేవలం వసూళ్లకే పరిమితం కాలేదని, నిధుల మ ళ్లింపు కోసం భారీగా రికార్డులను ఫోర్జరీ చేశారని స్పష్టమవుతోంది.
పథకాల పేరుతో ‘డబుల్’ గేమ్!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యవసాయ రంగం లో వీసీసీ (వాల్యూ చైన్ క్లస్టర్) అనేది రైతుల ఆ దాయాన్ని పెంచడానికి రూపొందించబడిన ఒక సమగ్ర వ్యవస్థ. ఇందులో భాగంగా 100 శాతం వేరుశనగ విత్తనాలు ఉచితంగా పంపిణీ జరగాలి. రికార్డుల ప్రకారం గోకఫసల్వాడ్, తిమ్మారెడ్డిపల్లి లో 373 మంది రైతులకు 506 క్వింటాళ్లను ఉ చితంగా పంపిణీ చేసినట్లు నివేదికలు ఇచ్చారు. కానీ వాస్తవానికి రైతుల వద్ద ‘ధర’కట్టి నగదు వ సూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రైతుకు కూడా రశీదు ఇవ్వకపోవడం గమనార్హం. బీఎల్‌డీ (బ్లాక్ లెవల్ డెమాన్‌స్ట్రేషన్) ఒక నిర్ణీత విస్తీర్ణంలో వేరుశనగ పంటను సాగు చేసే రైతుల కు 50 శాతం రాయితీపై పథకం కింద సగం ధ రకే ఈర్లపల్లి, గోకఫసల్వాడ్, చల్లాపూర్, దౌల్తాబా ద్ గ్రామాల్లోని 240 మంది రైతులకు 337 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇక్కడ కూడా ఒక్క క్వింటాల్ ఇచ్చిన రైతులకు రెండు క్వింటాళ్లు ఇ చ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసి గారడీ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అదనపు కోటా ను నల్లబజారుకు మళ్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వలస వెళ్లిన వారినీ వదలలేదు!
బతుకుదెరువు కోసం వలస వెళ్లిన రైతుల పేర్లను కూడా వదలకుండా వాడేశారు. రైతులకు తెలియకుండానే వారి పేర్లపై 100 శాతం సబ్సిడీ పొంది నట్లు రికార్డులు సృష్టించినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడవుతోంది. వేరుశనగ తీసుకోని వారు, దరఖాస్తు చేయని వారి పేర్లు కూడా లబ్ధిదారుల జాబితాలో ఉండటం విస్మయానికి గురిచేస్తోంది.
విచారణ ‘కరువు’!
గతంలో పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో వేరుశనగ విత్తన పంపిణీ అక్రమాలపై పత్రికల్లో పతా క శీర్షికల్లో వార్తలు వచ్చినా విచారణ మాత్రం కా గితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసినా, ఉన్నతాధికారులు ఉత్తుత్తి విచారణలతో అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఉన్నా యి. ఇప్పుడు దౌల్తాబాద్‌లోనూ అదే పంథాలో వి చారణను నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పం దించి తక్షణమే లబ్ధిదారుల జాబితాతో క్షేత్రస్థాయిలో ఫిజికల్ ఆడిట్ నిర్వహించి, బాధ్యులపై క ఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకటి ఇస్తే రెండు అని రాశారు.. క్రిమినల్ కేసులు పెట్టాలి!"
- విజయ్ బాబు, గోకఫసల్వాడ్
నేను అధికారుల దగ్గర ఒక క్వింటాల్ తీ సుకు న్నాను. కానీ RTI పత్రా ల్లో మా త్రం నా పేరు మీద రెండు క్వింటాళ్లు తీ సుకున్నట్లు నమోదు చేశారు. ఇలాంటి త ప్పుడు లెక్కలతో నిధులు స్వాహా చేస్తున్న అధికారులపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.
లిస్టులో పేరు ఎలా వచ్చింది?
- కిష్ట్యానాయక్ బాధిత రైతు
నేను అసలు వేరుశనగ గురించి దరఖాస్తు చేసుకోలేదు, తీసుకోలేదు. కా నీ అధికారుల జాబితా లో నా పేరు మీద ఎవరో తీ సుకున్నట్లు చూపిస్తున్నా రు. వీరికి సమాధానం చెప్పే వారెవరు?






