- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PDSU జాతీయ కమిటీ సభ్యునిగా పవన్ కుమార్ ఎన్నిక
PDSU జాతీయ కమిటీ సభ్యుడిగా పవన్ కుమార్ ఎన్నికవ్వడం హర్షించదగ్గ విషయమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబ తెలిపారు.

దిశ, వనపర్తి టౌన్ : PDSU జాతీయ కమిటీ సభ్యుడిగా పవన్ కుమార్ ఎన్నికవ్వడం హర్షించదగ్గ విషయమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదు దశాబ్దాల గొప్ప ఉద్యమ చరిత్ర కలిగిన విప్లవ విద్యార్థి సంఘం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ ప్రథమ జాతీయ మహాసభలు 2026 మార్చి 3, 4 తేదీలలో విజయవాడ నగరంలోని సింగ్ నగర్‌లో గుజ్జల సరళా దేవి ఫంక్షన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో వనపర్తి జిల్లాకు చెందిన కే. పవన్ కుమార్ జాతీయ కమిటీ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం వనపర్తి జిల్లాకు గర్వకారణం అన్నితెలిపారు. 2010 నుంచి సామాన్య కార్యకర్తగా ఉద్యమ జీవితం ప్రారంభించిన పవన్ కుమార్, విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ.. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి, ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదగడం విద్యార్థి ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఆయన ఎన్నిక వనపర్తి జిల్లాలోని విద్యార్థి లోకానికి నూతన ఉత్సాహాన్ని నింపింది అన్నారు.
అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ.. “శాస్త్రీయ విద్యా సాధన లక్ష్యంగా, సమసమాజ స్థాపన ధ్యేయంగా, అందరికీ సమాన విద్య అందించాలనే ఆశయంతో పని చేస్తున్న ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాను. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి సమరశీల పోరాటాలు నిర్వహిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి” అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






