- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : పట్నం నరేందర్ రెడ్డి
దిశ, మద్దూరు / కొత్తపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మద్దూరు మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం

దిశ, మద్దూరు / కొత్తపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి మద్దూరు మండల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు. బుధవారం మద్దూరు పట్టణ కేంద్రంలోని షా గార్డెన్ లో మద్దూరు, కొత్తపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, అదే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు బిఆర్ఎస్ పార్టీ ముద్రించిన బాకీ కార్డులను గ్రామాల్లోని ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు. అలాగే పోటికి సిద్ధంగా ఉండే ఆశావాహుల జాబితా సిద్ధం చేయాలని మండల నాయకులకు సూచించారు. పార్టీ ఎవరికీ టికెట్ ఇచ్చినా కూడా అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పట్టణ కేంద్రం కాచెరువు కట్ట మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్ట సందర్భంగా అక్కడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సమావేశంలో మద్దూరు మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం, కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వీరారెడ్డి, పీఎసీఎస్ మాజీ చైర్మన్ జగదీశ్ రెడ్డి, నాయకులు శివకుమార్, బసిరెడ్డి, నారాయణ,, మహేందర్, నరసింహ, బాల్ రెడ్డి, బాలచందర్, దాసు, ఏ కే రాజు పాల్గొన్నారు.






