- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్నారి చికిత్స కోసం కేటీఆర్ ను కలిసిన తల్లిదండ్రులు
తమ చిన్నారి లక్షిత చికిత్స కోసం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన నరేష్, కవిత దంపతులు కోరారు.

దిశ, తిమ్మాజీపేట : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన సేవకుల నరేష్, కవిత దంపతులకు 2024 డిసెంబర్ లో లక్షిత అనే పాప జన్మించింది. నెలలు గడిచినా పాప ఎదగకపోవడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. న్యూరో ట్రాన్స్ మీటర్ డిసార్టర్ వ్యాధి ఉందని.. ఆ వ్యాధి తగ్గాలంటే ఇంజెక్షన్ ఇవ్వాలని దాని ఖరీదు రూ.30కోట్లు ఉంటుందని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు షాక్ కి గురయ్యారు. పాపను కాపాడేందుకు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కేటీఆర్ ను కలిసి తమ పాపను ఆదుకోవాలని పాప తల్లిదండ్రులు వేడుకున్నారు. మెరుగైన వైద్యం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వారం రోజుల గడువులో తీసుకెళ్తానని.. తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో చర్లకోల లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు జోగు ప్రదీప్ కుమార్, ఎంపీపీ తూడి రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.






