- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీడిపల్లిలో బ్లాస్టింగ్ వల్ల భయాందోళనలు..?
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కల్వకుర్తి డివిజన్ లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు.

దిశ, కల్వకుర్తి : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో కల్వకుర్తి డివిజన్ లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గురువారం మండల పరిధిలోని జీడిపల్లి గ్రామ శివారులోనీ కూత వేటు దూరంలో బాంబులు పేలిన శబ్దాలు వినిపించాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్లాస్టింగులకు పాల్పడుతున్నారు. రాత్రిళ్ళు పేలుళ్ల శబ్దాలతో జీడిపల్లి గ్రామం దద్దరిల్లుతూ యుద్ద భూమిని తలపిస్తుందని గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామ శివారులోని ఓ పట్టా భూమిలో విండ్ పవర్ ప్రాజెక్ట్ లో భాగంగా దాదాపు 12 ఫీట్ల వెడల్పు, 18 ఫీట్ల ఎత్తులో (భూగర్భం అనుసరించి) సిమెంట్, 24 ఎంఎం కి పైగా సీకు ఉన్న సిమెంట్ బిడ్డు ఉండటంతో ఎలాంటి అనుమతులు లేకున్నా, నిబంధనలకు విరుద్ధంగా గ్రామాలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ పొలంలో రాత్రిళ్ళు బ్లాస్టింగ్స్ నిర్వహించారు. ఈ శబ్దాల ద్వార భూమి కంపించిందని, మందు గుండు సామాగ్రి రవాణా వాడకం పై ప్రత్యేక ఆంక్షలు ఉన్నప్పటికీ అవి అమలు జరగడం ఏంటని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీనికి ఆ గ్రామ ప్రజా ప్రతినిధులు వత్తాసు పలకడంతో ఈ దురఘతానికి పాల్పడ్డారనే అపవాదు ముటగట్టుకుంటున్నారు. బ్లాస్టింగ్ జరిగిందని శుక్రవారం కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కు సంభందించిన 12 మంది పాత్రికేయులు కవరేజ్ కోసం వెళితే పొలం యజమాని వారిపై దురుసుగా ప్రవర్తించి నానా బూతులు తిట్టాడు. అంతటితో ఆగకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని సమాచారం. అయితే అధికారుల కనుసన్నల్లోనే అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయా.. ? లేక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోయిన బ్లాస్టింగ్‌లు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ బ్లాస్టింగ్‌ల పై మైనింగ్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. బ్లాస్టింగ్ పేలుళ్ల దాటికి భూమి కంపించి బోరు రంద్రాలు మూతపడి నీళ్ళు రాక పంటలు పండించుకునే పరిస్థితి లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ చేయడంతో పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లు, మనుషుల, పశువుల పై పడితే పరిస్థితి ఏంటని చుట్టూ పక్కల వ్యవసాయదారులు భయపడుతున్నారు. రాత్రిళ్ళు పొలాల్లో పేలుళ్ల ధాటికి పశువులు భయంతో పరుగెత్తుతున్నాయని అంటున్నారు. ఈ విషయమై గ్రామస్తులు మున్దోస్తుగా రెవెన్యూ, డైల్ 100 ద్వార పోలిస్ శాఖ కు సమాచారం అందించిన ఫలితం శూన్యమని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ బ్లాస్టింగ్ లకు పాల్పడే నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని జీడిపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.






