పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి సస్పెండ్

by Ratna Kumari |

మండల పరిధిలోని వెంగలాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ ను శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో గోవిందరావు తెలిపారు.

పంచాయ‌తీ కార్య‌ద‌ర్శి సస్పెండ్
X

దిశ‌, పాన్ గల్ : మండల పరిధిలోని వెంగలాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్ ను శుక్రవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి సస్పెండ్ చేసినట్లు ఎంపీడీవో గోవిందరావు తెలిపారు. గ్రామ పంచాయితి నిధులను అక్రమ వినియోగిచాడని గ్రామ ప్రజలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారిని విచారణ చేసి నివేదిక అందించాలని ఆదేశించడంతో డీపీఓ విచారణ జరిపి నివేదికను కలెక్టర్ సమర్పించారు. నివేదిక ఆధారంగా సస్పెండ్ చేసినట్లు ఆయన తెలిపారు. విచారణలో సర్పంచ్ లు లేని సమయంలో గ్రామసభ తీర్మానాలు లేకుండా నిధుల డ్రా చేయడం, ట్రాక్టర్ నకిలీ ట్రక్ షీట్ చూపించడం, నకిలీ డీజిల్ బిల్లులు సృష్టించడం వంటివి చేశారు.


గ్రామంలో బల్బులు వేయకపోయినా వేసినట్టు నమోదు చేయడం, ఒకే పనికి రెండు సార్లు బిల్లులు పొందడం, ఇలా ప‌లుమార్లు తప్పుడు మార్గాల్లో నిధులను పక్కదారి పట్టించినట్లు విచార‌ణ‌లో స్ప‌ష్టం అయింది. జిల్లా అధికారులు కఠినంగా స్పందించి సస్పెన్షన్ చేశారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం పట్ల గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. ముఖ్య పాత్ర పోషించిన బిల్లా జగన్మోహన్ రెడ్డి , బండి శేఖర్ , మల్లెపు పరమేష్, జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య , దోసలి బాబు రెడ్డి, లక్ష్మారెడ్డి సంజీవ రెడ్డి లను గ్రామస్తులు అభినందించారు.

Next Story