దస‌రా పండుగ‌కు కాసుల వ‌ర్షం కురిపించిన పాల‌మూరు ఆర్టీసీ..!

by Ratna Kumari |

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ఈ దసరా పండుగకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ కి కాసుల వర్షమే కురిసింది. దసరా పండుగ నేపథ్యంలో

దస‌రా పండుగ‌కు  కాసుల వ‌ర్షం కురిపించిన పాల‌మూరు ఆర్టీసీ..!
X

దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి: ఈ దసరా పండుగకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ కి కాసుల వర్షమే కురిసింది. దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడమే కాకుండా ఆక్యుపెన్సీ రేషియోలో (ఓఆర్) రాష్ట్ర స్థాయిలోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. పండుగ ముందు, పండుగ తర్వాత ఉమ్మడి జిల్లాలోని ఏ బస్ స్టాండ్ లో చూసినా హైదరాబాద్ కు వెళ్లే ప్రత్యేక బస్సులతో ఫ్లాట్ ఫామ్ లు నిండిపోయి ప్రయాణికులతో కిటకిటలాడిపోయింది. దసరా సెలవులు ఇచ్చిన 14 రోజుల్లో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 10 డిపో లలోని మొత్తం 906 బస్సులలో 796 ప్రత్యేక బస్సులను హైదరాబాద్ కు నడిపి 53 లక్షల 7 వేల కిలోమీటర్లు తిప్పి, 63 లక్షల 20 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేసి, భారీ వర్షాలు కురిసినప్పుడు ఖాళీ బస్సులు తిరిగినా, 33 కోట్ల 65 లక్షల రూపాయల ఆదాయంతో రికార్డు నెలకొల్పి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ ఒక ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి చిన్న ప్రమాదం జరగకుండా పై స్థాయి అధికారుల నుండి కింది స్థాయి సిబ్బంది వరకు సమన్వయం చేసుకుంటూ, ప్రత్యేక సూచనలతో పండుగ బస్సులను నడిపారు.

ఈ ఘనత ప్రతి ఉద్యోగిది: ఆర్టీసీ ఆర్ఎం సంతోష్ కుమార్

ఈ అద్భుత విజయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి కృషి ఉందని, ముఖ్యంగా డ్రైవర్, కండక్టర్ల దని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన ఆర్ఎం కార్యాలయంలో మాట్లాడుతూ, తమ సిబ్బంది దసరా, బతుకమ్మ పండుగలకు దూరంగా ఉండి, విధులకు హాజరై, హైదరాబాద్ రూట్లలో విపరీతమైన వాహనాల రద్దీ ఉన్నా కూడా ఓపికతో చిన్న ప్రమాదం జరపకుండా, ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేసి, జిల్లా ఆర్టీసీకి మంచి పేరు తెచ్చారని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ను మొదటి స్థానంలో నిలపడంలో కృషి చేసిన అధికారులకు, ప్రతి ఉద్యోగిని ఆయన అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.

Next Story