- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంగట్లో సరుకుగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు : తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసి చైర్మన్
కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల పేరుతో చాలా మంది ఉన్నత ఆధికారులు భారి స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని..

దిశ, మహబూబ్ నగర్ : కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల పేరుతో చాలా మంది ఉన్నత ఆధికారులు భారి స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని.. మరో పోరుకు తాము సిద్దం అవుతున్నట్లు తెలంగాణ నిరుద్యోగ రక్షణ జేఏసి చైర్మన్ మహిపాల్ యాదవ్ అన్నారు. మహబూబ్ నగర్ ప్రేస్ క్లబ్ లో నిరుద్యోగులతో సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల పేరుతో కోందరిని నియమించి వారినే రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అన్నారు. మున్సిపాలిటి, ఇరిగేషన్, రెవెన్యూ వంటి శాఖలలో గతంలో చాలా మందిని కోందరు అధికారులు అక్రమంగా నియమించారని ఆరోపించారు. ప్రభుత్వాలు తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగులకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునేందుకు నిరుద్యోగ రక్షణ జేఏసి తో అందరూ కలిసి రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, పోగు శ్రీనివాస్, పాలమారు నిరుద్యోగులు పాల్గొన్నారు.






