- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరుగుదొడ్ల స్థలం కబ్జా ప్రయత్నాలపై ఆగ్రహం
అయిజ మున్సిపాలిటీలో సామూహిక మరుగుదొడ్డి స్థలం కబ్జా ప్రయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ 3వ వార్డులో సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సామూహిక మరుగుదొడ్డి స్థలంపై ఇటీవల కొంతమంది కబ్జాదారుల కన్నుపడింది.

దిశ, అయిజ : అయిజ మున్సిపాలిటీలో సామూహిక మరుగుదొడ్డి స్థలం కబ్జా ప్రయత్నాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మున్సిపాలిటీ 3వ వార్డులో సుమారు 60 సంవత్సరాల క్రితం నిర్మించిన సామూహిక మరుగుదొడ్డి స్థలంపై ఇటీవల కొంతమంది కబ్జాదారుల కన్నుపడింది. అక్రమార్కులు మరుగుదొడ్డి గోడలు కూల్చేసి, ఆ స్థలం తమదేనని ప్రకటిస్తూ స్థానికులను బెదిరించినట్టు కాలనీ వాసులు ఆరోపించారుఈ పరిణామంపై ఆగ్రహించిన మహిళలు, యువకులు పెద్దఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా నిర్వహించారు. అక్రమాలకు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు చేస్తూ, వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. న్యాయం జరిగేవరకు ఇక్కడినుంచి కదలమని స్పష్టం చేశారు.
దీనిపై మున్సిపల్ కమిషనర్ సైదులు స్పందిస్తూ.. ప్రభుత్వం, మున్సిపాలిటీకి చెందిన భూములు ఎవరికీ అన్యాక్రాంతం కానివ్వమని చెప్పారు. రికార్డులు పరిశీలించి సామూహిక మరుగుదొడ్డి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగితే అవి స్వాధీనం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్రమార్కులపై పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అదే స్థలంలో రూ.20 లక్షలతో కొత్త అధునాతన సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని కమిషనర్ ప్రకటించారు. అలాగే అక్రమార్కులకు కేటాయించిన అసెస్మెంట్ నంబర్లు డిలీట్ చేస్తానని కాలనీవాసులకు భరోసా ఇచ్చారు. తొలుత మరుగుదొడ్డి స్థలానికి బౌండరీ వాల్ వేయించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్ దేవరాజు, నాయకులు యోబు, మైనర్ బాబు, కాలనీ మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






