జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం

by Ratna Kumari |

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా 'పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం' పని చేస్తుందని సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ తెలిపారు.

జర్నలిస్టుల సంక్షేమమే మా ధ్యేయం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా 'పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం' పని చేస్తుందని సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం విధివిధానాలను వివరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వాకిట అశోక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు 15 మంది సభ్యులతో సంఘంగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసినట్లు, నియోజకవర్గంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులు అందరూ వెయ్యి రూపాయలు చెల్లించి శాశ్వత సభ్యత్వం పొందాలని కోరారు.


కార్యదర్శి మల్లు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఏదైనా కారణం చేత వర్కింగ్ జర్నలిస్టు మరణిస్తే బాధిత కుటుంబ సభ్యులకు 25 వేల తక్షణ ఆర్థిక సాయం, వికలత్వం, శాశ్వత వైకల్యం ఏర్పడినప్పుడు అత్యవసర వైద్య పరిస్థితుల్లో బాధపడుతున్న వారికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు. అనుకోని పరిస్థితుల్లో జర్నలిస్టు మరణిస్తే వారి పిల్లల విద్యకు 20 వేలు, ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రతను బట్టి 10 వేల నుంచి 50 వేల రూపాయల వరకు ఆర్థిక సహయాన్ని అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా పాలమూరు సంక్షేమ సంఘానికి లక్ష రూపాయల తొలి చెక్కు ను అందజేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి జి.రఘు, ఉపాధ్యక్షులు యాదయ్య, సహాయ కార్యదర్శి ఎం. తిరుపతయ్య, కార్యవర్గ సభ్యులు కె.రమాకాంత్ రెడ్డి, సతీష్ కుమార్, కె.కేశవులు, సంతోష్ కుమార్, సతీష్ కుమార్ రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.

Next Story