- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యం : షీ టీమ్ ఇన్ చార్జి ఎస్సై రజిత
దిశ, పెద్ద కొత్త పల్లి : ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యమని నాగర్ కర్నూల్ టీం ఇన్ చార్జి ఎస్సై రజిత వెల్లడించారు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం షీటీం

దిశ, పెద్ద కొత్త పల్లి : ఆడపిల్లల రక్షణనే మా లక్ష్యమని నాగర్ కర్నూల్ టీం ఇన్ చార్జి ఎస్సై రజిత వెల్లడించారు. పెద్దకొత్తపల్లి మండలం గంట్రావు పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం షీటీం ఆధ్వర్యంలో ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఇన్ చార్జి ఎస్సై రజిత మాట్లాడుతూ ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు. కొందరు కీచకులు అమ్మాయిలను వాళ్ళు వచ్చిపోయే టైం ని గమనించి వారిని హేళన చేయడం, అవమానించడం, ప్రేమించమని ఒత్తిడి చేయడం చేస్తూ ఉంటారని, ఇలా ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, లైంగిక దాడికి పాల్పడిన అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీం ఇంచార్జి రజిత హెచ్చరించారు. అమ్మాయిలు మహిళలు ఎవరికి ఏ ఇబ్బంది ఏదురైనా వెంటనే షీ టీం నెంబర్ కి 8712657676 కాల్ చేయాలని షీ టీం ఏఎస్సై విజయ లక్ష్మీ వివరించారు. భరోసా కేంద్రం ద్వారా బాధితులకు పోలీసు సహకారమే కాకుండా న్యాయపరమైన, వైద్యపరమైన సహాయం అందించడంతో పాటు సానుకూల వాతావరణంలో వారికి అవసరమైన కౌన్సెలింగ్ వంటి సేవలను అందిస్తున్నామని భరోసా కో ఆర్డినేటర్ శ్రీలత చెప్పారు. ఇతరుల మాయమాటలు నమ్మి.. చాలా మంది బాధితులు తమ జీవితాలు ప్రమాదపు అంచులోహ్యూమన్ ట్రాఫికింగ్ లో పడిపోతున్నారు. మన జిల్లాలో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పని చేస్తోంది అని ఏహెచ్టీయూ మెంబర్ వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం మెంబర్స్ వెంకటయ్య, వెంకట్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు భాస్కర్ రావు , టీచర్స్ పాల్గొన్నారు.






