- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతు భరోసా కొత్త దరఖాస్తులకు జూలై 5 వరకు అవకాశం..
by Kodari Anjali |
2026-27 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గోపాలపేట మండల వ్యవసాయ అధికారి కర్ణశ్రీ తెలిపారు.

X
దిశ, గోపాలపేట: 2026-27 వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకానికి కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు గోపాలపేట మండల వ్యవసాయ అధికారి కర్ణశ్రీ తెలిపారు. 2026, జూన్15లోపు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, అలాగే గతంలో పట్టాదారు పాసు పుస్తకం వచ్చినా బ్యాంకు వివరాలు నమోదు చేయించుకోని రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను రైతు భరోసా దరఖాస్తుతో జత చేసి తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూలై 5, 2026 అని పేర్కొన్నారు. అర్హులైన రైతులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Next Story






