- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు అవకాశం
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు అవకాశాలు కల్పించినట్లు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో అన్ని కులాలకు అవకాశాలు కల్పించినట్లు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం 60 డివిజన్లలో 52 సీట్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లకు కేటాయించడం జరిగిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి ఈ మేరకు సీట్ల కేటాయింపు జరిగిందన్నారు. కొంతమంది సీనియర్లకు టికెట్లు ఇవ్వలేకపోయామని, ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో చాలా మంది పార్టీలో చేరినప్పుడూ టికెట్లు ఇస్తామని వాగ్దానం చేశామని, అందువల్ల వారికి ఇవ్వడం జరిగిందన్నారు. టికెట్లు రానివారికి రాబోయే రోజుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. టికెట్ ఆశించి దక్కకపోవడంతో చాలా మంది పోటీల్లో ఉన్నారని, రెబల్స్ గా నిలబడ్డవారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పాటుపడాలని, తమ మాట వినకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ 50 కి పైగా డివిజన్లలో గెలుపొందేలా ప్రజలు మద్దతుగా నిలిచి విజయాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, నాయకులు చంద్రకుమార్ గౌడ్, రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు అంజయ్య చారి, బాలకిషన్, గట్టు వెంకటరెడ్డి, గౌస్ పాష పాల్గొన్నారు.






