- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఊట్కూర్‌ను ముంపుగా గుర్తించాలి
మక్తల్- నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపడుతున్న పనుల వలన ఊట్కూర్ గ్రామం ముంపు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని సర్పంచ్ రేణుక భరత్ తెలిపారు.

దిశ, ఊట్కూర్ : మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భాగంగా చేపడుతున్న పనుల వలన ఊట్కూర్ గ్రామం ముంపు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని సర్పంచ్ రేణుక భరత్ తెలిపారు. ప్రస్తుతం చెరువులో నీటి నిల్వ కారణంగా గ్రామంలోని పలు వీధుల్లో ఊట నీరు పెరిగి ఇళ్లపై ప్రభావం చూపుతోందన్నారు. 1వ వార్డు నుంచి 7వ వార్డుల వరకు ఇళ్ల పునాదుల కోసం తవ్విన గుంతలలో కూడా నీరు ఉబికి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్మశాన వాటికల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొందని వివరించారు. ప్రాజెక్ట్ కింద చెరువు నిల్వ సామర్థ్యం పెంపు, కొత్త కట్ట నిర్మాణం వల్ల భవిష్యత్తులో ముంపు ప్రమాదం మరింత పెరుగుతుందని పేర్కొంటూ ఊట్కూర్‌ను అధికారికంగా ముంపు గ్రామంగా గుర్తించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు తెలిపారు. ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీధర్ స్పందించి గుర్తింపునకు అవసరమైన భూ పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. మాజీ ఎంపీటీసీ హనుమంతు, ఉప సర్పంచ్ రమేష్, నరేష్, శివ ఉన్నారు.






