- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తెలిపారు.

దిశ, నాగర్ కర్నూల్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధనల ప్రకారం సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఫిబ్రవరి 28తో ముగియనందున అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను (ఓరిజినల్) జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. మీడియా యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లా స్థాయిలో ఆన్ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 9 నుంచి సమర్పించాలని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.






