కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు

by Nallavelli.Anjaneyulu |

ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించారు. బుధ‌వారం తెల్ల‌వారుజామున ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు.

కొనసాగుతున్న శ్రీ లక్ష్మీనరసింహ బ్రహ్మోత్సవాలు
X

దిశ, ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోని మామిళ్ళపల్లి గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి ఉమ్మడి జిల్లా స్థాయి కోలాటం పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. గ్రామం మొత్తం పెద్ద సంఖ్యలో భక్తులు, కళాభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ పోటీలలో మొత్తం 11 జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి.మొదటి బహుమతి అంజి మాస్టర్ నంది వడ్డెమాన్ బృందానికి దక్కగా మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన కడారి రవీందర్ రూ.30 వేలు నగదు బహుమతిని అందజేశారు. రెండో బహుమతి ప్రదీప్ మాస్టర్ జప్తిసదగోడు బృందానికి లభించగా.. వారికి కొత్త మధుసూదన్ రావు (కాంట్రాక్టర్) పెద్దాపూర్ రూ.20వేలు బహుమతిని అందజేశారు. మూడో బహుమతి శివారెడ్డి అంబటిపల్లి బృందానికి మామిళ్ళపల్లి గ్రామానికి చెందిన చలమల పరమేష్ గౌడ్ 15 వేలు అందజేశారు.

నాలుగో బహుమతి యాపట్ల గ్రామానికి చెందిన శశి మాస్టర్ బృందానికి లభించగా.. రూ.10వేలు నగదు బహుమతిని మామిళ్ళపల్లి డిప్యూటీ సర్పంచ్ పానం సైదులు అందజేశారు. ప్రతి జట్టుకు ప్రోత్సాహకంగా కన్సోలేషన్ బహుమతిగా రూ.3వేలు చొప్పున దేవస్థాన చైర్మన్ వేముల నరసింహారావు, సర్పంచ్ ముకురాల మోహన్ గౌడ్ అందజేశారు. బ్రహ్మోత్సవాల వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ కోలాటం పోటీలు గ్రామీణ కళలకు ప్రోత్సాహం కల్పించాయని, సంప్రదాయాలను పరిరక్షించడంలో ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని గ్రామస్థులు , భక్తులు పేర్కొన్నారు.బుధవారం తెల్లవారుజామున రథోత్సవ కార్యక్రమం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పాలకమండలి సభ్యులు కోరారు. ఎస్సై వెంక‌ట్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో పోలీసులు బందోబ‌స్తు నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉప్పునుంత‌ల కాంగ్రెస్ అధ్య‌క్షులు క‌ట్ట అనంత‌రెడ్డి, నాయకులు గంగుల నరసింహారెడ్డి, గోవర్ధన్ రెడ్డి ,పాలక మండలి సభ్యులు చలమల గణేష్ గౌడ్, బుధగం శ్రీనివాస్ గౌడ్, ఎలుక స్వరూప సుదర్శన్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story