- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దొంగల హల్ చల్.. గోల్డ్, వెండి అపహరణ
దిశ, ఉండవెల్లి : మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో దొంగల హల్ చల్ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్

దిశ, ఉండవెల్లి : మండల పరిధిలోని అలంపూర్ చౌరస్తాలో దొంగల హల్ చల్ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో శ్రీధర్ కుటుంబం తో పాటు పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ కుటుంబం నివసిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి కర్నూలు వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఇరు కుటుంబాలు వెళ్లారు. వివాహ వేడుక ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి చూడగా.. రెండు ఇళ్ల తాళాలు, బీరువా తాళాలు పగలగొట్టి ఉండటం చూసి ఆశ్యర్యపోయారు. దీంతో రాజశేఖర్ ఇంటి ఓనర్ శ్రీధర్ కు చోరీ జరిగినట్టు సమాచారం ఇచ్చారు. శ్రీధర్ ఇంటికొచ్చి చూడగా తన బీరువాలోని లక్ష రూపాయల నగదు, అర తులం బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. అలాగే పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ ఇంట్లో 5 తులాల వెండి ఒక మొబైల్ చోరీకి గురైనట్లు నిర్దారించారు. సీఐ రవిబాబు, ఎస్ఐ శేఖర్ క్లూస్ టీం సంఘటన స్థలం చేరుకుని వివరాలను సేకరించారు. శ్రీధర్ రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






