ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

by velandi.Saikiran |

మండలంలోని మరికల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాజిపేటకు చెందిన అరవింద్ (17 ఏళ్లు) అనే యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి
X

*ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి*

*ఇద్దరికి తీవ్ర‌ గాయాలు*

దిశ, తిమ్మాజీపేట: మండలంలోని మరికల్ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మాజిపేటకు చెందిన అరవింద్ (17 ఏళ్లు) అనే యువకుడు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల, ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి వివరాల మేరకు తిమ్మాజీపేట నుండి జడ్చర్ల ప్రధాన రహదారిలో రాత్రి మోటార్ సైకిల్ పై వెళ్లారు అరవింద్, శివ, వెంకటేష్. మరికల్ గ్రామ సమీపంలో ముగ్గురు యువకులు బైక్ మరికల్ నుండి జడ్చర్ల వైపు వెళ్లారు. ఎదురుగా వస్తున్న కారు గమనించక పోవడంతో బైక్ అదుపు తప్పి ఇంటర్ చదువుతున్న యువకుడు అరవింద్ యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు. శివ, వెంకటేష్, అనే యువకులకు కాళ్ళు విరగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక ఎస్సై అక్కడ చేరుకున్నారు. మృతి చెందిన యువకుడు అరవింద్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.ఈ సంఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తెలిపారు.

Next Story