ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల భ‌వ‌న నిర్మాణానికి అధికారుల స‌ర్వే

by Ratna Kumari |

ప‌ట్ట‌ణంలోని డిగ్రీ క‌ళాశాల శాశ్వ‌త భ‌వ‌నానికి ఇంజినీర్ అరుణ్, అధికారులు శ‌నివారం స‌ర్వే చేప‌ట్టారు.

ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల భ‌వ‌న నిర్మాణానికి అధికారుల స‌ర్వే
X

దిశ‌, మ‌క్త‌ల్ : ప‌ట్ట‌ణంలోని డిగ్రీ క‌ళాశాల శాశ్వ‌త భ‌వ‌నానికి ఇంజినీర్ అరుణ్, అధికారులు శ‌నివారం స‌ర్వే చేప‌ట్టారు. మ‌క్త‌ల్ ప‌ట్ట‌ణంలో ఇంట‌ర్, డిగ్రీ, పీజీ కాలేజీల‌కు శాశ్వ‌త భ‌వ‌నాలుండాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి ఇరిగేష‌న్ కార్యాల‌యం స్థ‌లాన్ని ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వనంలో కార్యాల‌యం కొన‌సాగుతోంది. ఈ కార్యాల‌యాన్ని పూర్తిగా తొల‌గించి ఈ స్థ‌లాన్ని చ‌దును చేసి స‌ర్వే నిర్వ‌హించి నివేదిక రూపొందించాల‌ని మంత్రి వాకిటి శ్రీహ‌రి ఆదేశాల మేర‌కు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు ర‌వికుమార్, పంచాయ‌తీ రాజ్ అధికార్ల‌తో ఇరిగేష‌న్ కార్యాల‌యం వ‌ద్ద పూర్తిగా కొల‌త‌లు తీసుకున్నారు. మొత్తం ఆవ‌ర‌ణ స్థ‌లం ఇత‌ర స్థ‌లాన్ని ప‌రిశీలించారు. ఇరిగేష‌న్ కార్యాల‌యాన్ని మ‌రోచోటుకు తెరదించేందుకు ప్ర‌ణాళిక రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. డిగ్రీ కాలేజీ భవనం నుంచి బస్టాండ్ కి వెళ్ళేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయుల రాకపోకలు శాశ్వత రహదారి కోసం స్థల పరిశీలన చేపట్టారు. బస్టాండ్ సమీపంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే విద్యార్థులకు పూర్తి అనుకూలంగా ఉంటుందని.. రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజ్ తోపాటు పీజీ కాలేజ్ సైతం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అందరూ తగినట్లుగా ఒకేసారి భవన నిర్మాణాలు చేపట్టే విధంగా సర్వే చర్యల రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఏ ఈ అరుణ్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్. కోఆప్షన్ నెంబర్ వల్లంపల్లి లక్ష్మణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షాలం ఉన్నారు.

Next Story