ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి

by Ratna Kumari |

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు చేరేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు.

ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు సమన్వయంతో పని చేయాలి
X

దిశ, వరంగల్ బ్యూరో : ప్రభుత్వ పథకాల అమలుకు అధికారులు, ప్రజలు సమన్వయంతో పని చేయాలని మాజీమంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా స్థాయి సమావేశం వరంగల్ హంటర్ రోడ్‌లోని శ్రీ కన్వెన్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బస్వరాజ్ సారయ్య, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ, వర్ధన్నపేట మున్సిపల్ చైర్‌పర్సన్ సారంగపాణి, సన్‌ప్రీత్ సింగ్, డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) గణేష్ పాల్గొన్నారు.

“ప్లాస్టిక్ నిషేధం - మన వరంగల్ పరిరక్షణ” అనే కాన్సెప్ట్‌తో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్‌ను సందర్శించిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్లాస్టిక్ రహిత వరంగల్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తోందన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణలక్ష్మి, రైతు భరోసా వంటి పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల ముంగిటకు చేరుతున్నాయని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధి, విద్యా రంగ బలోపేతం, సామాజిక భద్రత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించే వినూత్న పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురానుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల హాజరు శాతం పెంపు కోసం ఈ విద్యా సంవత్సరం నుంచి అల్పాహారం పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కట్టుబడి పనిచేస్తోందన్నారు.

కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలలో 10 కీలక అంశాలపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రైతు భరోసా, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, రోడ్డు భద్రత, మహిళా-శిశు రక్షణ, యువజన మరియు క్రీడా కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో 136 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని, 550 మార్కులకు పైగా సాధించిన 103 మంది విద్యార్థులను సన్మానించినట్లు తెలిపారు. మెగా జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. తెలంగాణ నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఎం సువిధా – నాబార్డ్” శిక్షణ పూర్తి చేసిన మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలల్లో జిల్లాలో 427 స్వయం సహాయక సంఘాలకు రూ.28 కోట్లు 28 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాల చెక్కులు అందజేశారు. వడ్డీ లేని రుణాల పథకం కింద డిసెంబర్ 2023 నుంచి నవంబర్ 2025 వరకు 9,669 స్వయం సహాయక సంఘాలకు రూ.40 కోట్లు 67 లక్షల చెక్కులను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ మరియు నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, సంబంధిత జిల్లా అధికారులు, మండల తహసీల్దారులు పాల్గొన్నారు.

Next Story