అంట‌రానిత‌నాన్ని రూపు మాపేందుకే పౌర హ‌క్కుల దినోత్స‌వం

by Nallavelli.Anjaneyulu |

దిశ, చిన్నంబావి : చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గిర్దావర్ రాములు, కొప్పునూర్ హాస్టల్ వెల్పర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి లు

అంట‌రానిత‌నాన్ని రూపు మాపేందుకే పౌర హ‌క్కుల దినోత్స‌వం
X

దిశ, చిన్నంబావి : అంట‌రానిత‌నాన్ని రూపు మాపేందుకే పౌర హ‌క్కుల దినోత్స‌వం గిర్దావర్ రాములు, కొప్పునూర్ హాస్టల్ వెల్పర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నంబావి మండలం అయ్యవారి పల్లి గ్రామంలో గురువారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా లు మాట్లాడుతూ ప్రతి నెలా మండలం లోని ఒక గ్రామంలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంద‌ని.. కార్యక్రమా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే..? ఇప్పటికి గ్రామాల్లో అక్కడక్కడ అంటరాని తనం కొనసాగడం వల్ల వాటి నిర్మూలన కోసం అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. గ్రామంలో ఎవరైనా అంటరాని తనంగా వ్యవహరిస్తే మీరు భ‌యపడకుండా నేరుగా మండల తహసిల్దార్ కార్యాలయంలో పిర్యాదు చేస్తే అట్టి వారి పై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిర్ధవర్ రాములు, రవీందర్ రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ షెడ్యూల్డ్ కులాల పెద్దలు, యువత పాల్గొన్నారు.

Next Story