నారాయణపేటకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయాలి

by Disha Web Desk 1 |
నారాయణపేటకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయాలి
X

అసెంబ్లీలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

దిశ, నారాయణపేట: నారాయణపేట జిల్లాకు నర్సింగ్ కళాశాలను మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నర్సింగ్ కాలేజ్ మంజూరు చేస్తామని చెప్పడంతో నారాయణపేటకు నర్సింగ్ కళాశాలను ఈ అకాడమీ ఇయర్ నుంచే ప్రారంభిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అసెంబ్లీలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును కోరారు. నారాయణపేట జిల్లా ఆస్పత్రి నూతన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాతున్నాయని తెలిపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన మంత్రి హరీష్ రావు సమాధానమిస్తూ నర్సింగ్ కాలేజ్ మంజూరి అంశం ఫేజ్ త్రీలో అన్న మాటకు కట్టుబడి నర్సింగ్ కాలేజీ మంజూరు చేస్తామని తెలిపారు.





Next Story

Most Viewed