ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదు : ఎస్పీ జానకి

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగరాదు : ఎస్పీ జానకి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలు స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకి తెలిపారు. బుధవారం స్థానిక బాలికల జూనియర్ కళాశాలలో గ్రామ పంచాయతీ ఎన్నికల సామాగ్రీ పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించి సిబ్బంది హాజరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ సమయంలో గురువారం జరిగే పోలింగ్ సందర్భంగా పాటించాల్సిన విధులు గురించి పలు సూచనలు చేశారు. ప్రజలను ప్రభావితం చేసే ప్రయత్నాలు, గుంపులుగా తిరగడం, గొడవలు వంటి వాటిని వెంటనే అరికట్టాలని, పరిస్థితులను బట్టి సిబ్బంది చురుకుగా, వేగంగా స్పందించాలని సూచించారు. ఎన్నికల సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా తటస్థంగా, నిష్పాక్షికంగా ప్రవర్తించాలని, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్రమశిక్షణను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులు వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న ఓటర్లకు సహకారం అందించాలని, అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని, ప్రజలు క్యూ లో నిలబడే సమయంలో ఎలాంటి గొడవలకు జరగకుండా సిబ్బంది క్రమశిక్షణను కాపాడాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సమస్యలేమీ లేకుండా జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ జానకి భరోసా కల్పించారు. ఎస్పీ వెంట ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి, సీసీఎస్ సీఐ పరమేశ్వర్ గౌడ్, రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

Next Story