ఇకపై నో హెల్మెట్-నో ఫ్యూయల్: ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి

by Nallavelli.Anjaneyulu |

ఇక పై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులకు వస్తే.. పెట్రోల్ పోయకూడదని ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి సూచించారు.

ఇకపై నో హెల్మెట్-నో ఫ్యూయల్:  ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఇక పై ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం పెట్రోల్ బంకులకు వస్తే.. పెట్రోల్ పోయకూడదని ట్రాఫిక్ సీఐ భగవంత్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు మంగళవారం మహబూబ్ నగర్ పట్టణంలోని పెట్రోల్ బంకుల యజమానులతో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని, రోడ్డు ప్రమాదాల్లో తలకు తగిలే గాయాలతో మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు. హెల్మెట్ ధరించడమనేది మీ కుటుంబానికి భరోసానిచ్చిన వారవుతారని ఆయన హితవు పలికారు. అలాగే 'నో హెల్మెట్-నో ఫ్యూయల్' అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. ఇంతటి కఠినమైన నిర్ణయం మీ ప్రాణరక్షణకేనన్న సంగతి గుర్తుంచుకోవాలని, అంతేకాక హెల్మెట్ ధరించడం వలన చట్టాన్ని మీరు గౌరవించిన వారవుతారని, ఇందుకు ద్విచక్ర వాహనదారులు, పెట్రోల్ బంక్ లో యజమానులు సహకరించాలని సీఐ భగవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Next Story