- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దళితులు ఎవ్వరూ అధైర్య పడొద్దు.. చట్టాలు అండగా ఉంటాయి : మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
దిశ, తెలకపల్లి : దళితులు ఎవ్వరూ అధైర్య పడొద్దు.. చట్టాలు అండగా ఉంటాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. నాగర్

దిశ, తెలకపల్లి : దళితులు ఎవ్వరూ అధైర్య పడొద్దు.. చట్టాలు అండగా ఉంటాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం జంగ మోనిపల్లి గ్రామంలో దుర్గ మాత వేడుకలో మాల కులానికి చెందిన వారిని దుర్గ మాతను దర్శించుకోవద్దని కుల వివక్ష చూపిన సంఘటన కు వ్యతిరేకంగా జాతీయ మాల మహానాడు అధ్యక్షులు చెన్నయ్య బృందం వివరాలు తెలుసుకునేందుకు పర్యటించింది. జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. ఇక యాదవసంఘం పెద్దలతో చర్చించి అందరూ కలిసి జీవించాలని.. అంబేద్కర్ రచించిన చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాల మాట్లాడుతూ దళితులు ఎవ్వరూ అధైర్యపడకూడదని.. డా.బీ.ఆర్. అంబేద్కర్ రాసిన చట్టం మీకు అండగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి అవమానాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని.. ప్రజా ప్రతినిధులకు, యాదవసంఘం నేతలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బూరు వెంకటేశ్వర్లు, ఎన్నిపోతుల అనిల్, కుందా మల్లికార్జున్, కిన్నెర పాండు, గాజుల రాజు, సుధాకర్ బాబు, మనోహర్, తుమ్మ శివ , చెన్నయ్య పాల్గొన్నారు.






