- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏదుల రిజర్వాయర్ పక్కనే గొల్లపల్లిలో మరో రిజర్వాయర్
దిశ, రేవల్లి : తెలంగాణ అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

దిశ, రేవల్లి : తెలంగాణ అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మంగళవారం పలు దినపత్రికలు, సామాజిక మాధ్యమాలలో ప్రసారం అయింది. దీంతో గొల్లపల్లి, చీరకపల్లిల గ్రామాలవద్ద మరో రిజర్వాయర్ నిర్మాణం ఖరారుకావడంతో ఏదుల మండలంలోని గొల్లపల్లి, చీర్లపల్లి గ్రామస్తులు భగ్గుమని ఆందోళన చేపట్టారు. వారంతా ముంపు బాధితుల అఖిల పక్షంగా ఏర్పడి ఏదుల-వనపర్తి ప్రధాన రహదారిపై ధర్నాకుదిగి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాలమూరు- రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ కు కిలోమీటర్ దూరంలోనె గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించడం ఎవరి స్వార్థం ప్రయోజనం కోసం నిర్మిస్తున్నారని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (KLI) ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలేసిందని కొంత ప్రాజెక్ట్ కట్టి రిజర్వాయర్ మరిచారు. ఫలితంగా వనపర్తి జిల్లాలోని గోపాల్ పేట్, పాన్ గల్, కోడేర్ మండలాలకు KLI D8 ద్వారా 28000 ఎకరాలకు నీటి కెటాయివులు పెట్టారు కానీ చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు అరిగోస పడ్డారు. వనపర్తి నియోజకవర్గం లోని పెద్దమందడి, ఘనపూర్ మండలాలు మరిచ్చారు.
కోడేర్ ఇతర గ్రామాలకు నీరు ఇవ్వడం కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ప్రపోజల్ ఉండేది కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ పక్కనే కావడంతో గత ప్రభుత్వం రైతుల భూములకు నష్టం వాటిల్లకుండా గొల్లపల్లి రిజర్వాయర్ అనేది విరమించుకోవడం జరిగింది. పక్కలో కిలోమీటర్ దూరంలో ఉన్న ఏదుల రిజర్వాయర్ 100% పనులు పూర్తవగా.. వనపర్తి జిల్లాకు మరియు కోల్లాపూర్ ప్రాంతానికి 45000 ఎకరాలకు సాగునీరు అందించడం కోసం ఏదుల రిజర్వాయర్ దగ్గర తూము(OT)ను నిర్మాణం పూర్తి చేశారు. మొత్తం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 10 శాతం పనులు పెండింగ్ లో ఉన్నాయి. వాటిని పూర్తి చేసి కాలువలు.. వర్షం నీటికి తోడు ప్రాజెక్ట్ నీరు వదిలితే రైతులకు మేలు జరుగుతుంది. ఇవి ఏవి చేయకుండా ఏవరి ప్రయోజనాల కోసం గొల్లపల్లి రిజర్వాయర్ ముందు తెచ్చారు.దీని వల్ల మూడు గ్రామాల రైతుల భూములు భలిస్తారా కాంట్రాక్టుల ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమం లో దొడ్ల రాములు, బంకల సునీల్ కుమార్, విజయ్ మోహన్, కళ్యాణ్, మహమూద్ పాల్గొన్నారు.






