నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ : ఎంపీ డీ.కే.అరుణ

by Ratna Kumari |   (  Updated:2026-05-10 15:44:32  IST  )

ప‌శ్చిమ బెంగాల్ త‌రువాత భారతీయ జనతా పార్టీ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు.

నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ : ఎంపీ డీ.కే.అరుణ
X
దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ప‌శ్చిమ బెంగాల్ త‌రువాత భారతీయ జనతా పార్టీ టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను అన్ని విధాల మోసం చేశారని డీకే అరుణ ఆరోపించారు. దేశాన్ని అభివృద్ధి పరంగా తీర్చిదిద్దే సత్తా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉందని.. ప్రగాఢంగా విశ్వసించి ఇటీవల జరిగిన ఎన్నికలలో ప‌శ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టి అధికారాన్ని కట్టబెట్టారు అని ఆమె చెప్పారు.

వికసిత్ భార‌త్ లో భాగంగా ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎత్తున నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం మన అందరికీ గర్వకారణమని ఎంపీ చెప్పారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు, నిధులు, నియామకాలు జరగాలి అంటే అది భారతీయ జనతా పార్టీ.. డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యం అవుతుంది అని అరుణ పేర్కొన్నారు. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు.
Next Story