- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100% ఉత్తీర్ణత సాధించిన న్యూ ఎరా విద్యార్థులు..
భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని న్యూ ఎరా పాఠశాల విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో 100% ఉత్తీర్ణతను సాధించారు.

X
దిశ, భూత్పూరు: భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని న్యూ ఎరా పాఠశాల విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో 100% ఉత్తీర్ణతను సాధించారు. కే. ప్రణయ అనే విద్యార్థిని 572 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. కే. గౌతమ్ అనే విద్యార్థి 563, కే. ప్రశాంత్ కుమార్ 560 మార్కులు సాధించగా ఎం. అజయ్ కుమార్, కే. భార్గవి 55 మార్కులు, ఎం. శ్రీనిధి 536, జి. శ్రావణి 533 మార్కులు సాధించారు.
మొత్తం 19 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారు. 28 మంది విద్యార్థులు 400కు పైగా మార్కులను సాధించి తమ సత్తా చాటారు. పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడంతో ప్రిన్సిపాల్ వి. ప్రతిమ క్రాంతి కుమార్ ,కరస్పాండెంట్ క్రాంతికుమార్, పాఠశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు. అనంతరం భూత్పూర్ చౌరస్తాలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందాలను పంచుకున్నారు.
Next Story






