- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలమూరు వర్సిటీలో నూతన కోర్సులు ప్రవేశపెట్టాలి : ఎస్ఎఫ్‌ఐ
మారుతున్న కాలానికి పోటీ ప్రపంచానికి అనుగుణంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి నూతన కోర్సులను తక్షణమే ప్రవేశ పెట్టాలని ఎస్ఎఫ్‌ఐ పీయు కమిటీ డిమాండ్ చేసింది.

దిశ- మహబూబ్ నగర్ : మారుతున్న కాలానికి పోటీ ప్రపంచానికి అనుగుణంగా పాలమూరు విశ్వవిద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి నూతన కోర్సులను తక్షణమే ప్రవేశ పెట్టాలని ఎస్ఎఫ్‌ఐ పీయు కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్ బాబు ఎస్ఎఫ్‌ఐ ప్రతినిధులు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలమూరు వర్సిటీ ప్రారంభంలో కొన్ని కోర్సులతోనే మొదలైనప్పటికీ, ప్రస్తుతం వేలాది మంది విద్యార్థులతో దినదిన అభివృద్ధి చెందుతోందని, మారుతున్న కాలానికి అనుగుణంగా మరిన్ని నూతన కోర్సులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నాలుగేళ్ల క్రితమే యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌కు ఆమోదం లభించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల అది ప్రారంభం కాలేదని గుర్తు చేశారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్‌సీటీఈ 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని, అధికారులు స్పందించి ఈ కోర్సును వెంటనే ప్రారంభించాలని, మన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సు ఎంతో కీలకమని స్పష్టం చేశారు. దీంతో పాటు, సివిల్స్, గ్రూప్స్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం అత్యంత ప్రాముఖ్యత కలిగిన హిస్టరీ (చరిత్ర), పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం వంటి కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని వర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కడా ఈ కోర్సులు అందుబాటులో లేవని, పీయూలో వీటిని ప్రారంభిస్తే వేలాది మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. వర్సిటీ అధికారులు సానుకూలంగా స్పందించి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ కోర్సులను త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్‌ఐ పియు కార్యదర్శి బత్తిని రాము, ఉపాధ్యక్షుడు సుధాకర్, సహాయ కార్యదర్శి తౌఫిక్ పాల్గొన్నారు.






