- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రైతు పరిస్థితి విషమం
దిశ, మిడ్జిల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ పొలంలో స్ప్రింక్లర్ పైపులు మారుస్తుండగా 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి రైతు పరిస్థితి విషమంగా మారిన సంఘటన మిడ్జిల్ మండలంలో చోటు

దిశ, మిడ్జిల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వ్యవసాయ పొలంలో స్ప్రింక్లర్ పైపులు మారుస్తుండగా 11కేవీ విద్యుత్ వైర్లు తగిలి రైతు పరిస్థితి విషమంగా మారిన సంఘటన మిడ్జిల్ మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన పరుశరాములు తన వ్యవసాయ పొలంలో పంట చేనుకు పైపులు మారుస్తుండగా.. 11 కేవీ వైర్లు తగలడంతో విద్యుత్ షాక్ గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పక్కన ఉన్న రైతు శాంతయ్య తన టవల్ సాయంతో కాపాడారు. వెంటనే చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. రైతు పరశురాములు విద్యుత్ శాఖ అధికారుల కు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం లో తక్కువ ఎత్తులో విద్యుత్ వైర్లు ఉండడంతో ఎత్తు పెంచాలని పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. పరశురాములకు ఎడుమ చేయి స్పర్శ లేదని తెలిపారు.






