- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అధికారుల నిర్లక్ష్యం.. విద్యార్థుల పాలిట శాపం
అధికారుల నిర్లక్ష్యంతో మద్దూరు డిగ్రీ కళాశాల విద్యార్థుల పట్ల శాపంగా మారింది. దీంతో విద్యార్థులతో పాటు కళాశాల కార్యకలాపాలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది.

దిశ, మద్దూరు : అధికారుల నిర్లక్ష్యంతో మద్దూరు డిగ్రీ కళాశాల విద్యార్థుల పట్ల శాపంగా మారింది. దీంతో విద్యార్థులతో పాటు కళాశాల కార్యకలాపాలకు కూడా ఆటంకం ఏర్పడుతుంది. మద్దూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గదిని, ఇతర గదులను సుమారు రెండు నెల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మద్దూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ అభ్యర్థన మేరకు ఎన్నికల సామాగ్రి భద్రపరచుకొనుటకు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కొరకు ప్రిన్సిపాల్ గదితో పాటు ఇతర తరగతి గదులను డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బి కృష్ణారెడ్డి అప్పగించారు. కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం ప్రిన్సిపాల్ గదిలో ఉన్న కంప్యూటర్లను అస్తవ్యస్తంగా తీసి వాటితో పాటు ఇతర సామాగ్రిని కూడ బయటపెట్టి ప్రాంగణంలో అలాగే వదిలివేశారు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది ఇతర సామాగ్రితో పాటు కంప్యూటర్లను కూడా ఎప్పటిలాగా అమర్చుకోగా కంప్యూటర్లు పని చేయకపోవడంతో ఈ విషయం తన దృష్టికి రాగానే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కంప్యూటర్లను కూడా మున్సిపల్ కార్యాలయానికి పంపించారు.
నాటి నుంచి అడిగిన ప్రతిసారి ఇవాళ రేపు అనుకుంటూ కాలయాపన చేస్తున్నాడని కంప్యూటర్లు ఇప్పటికీ మున్సిపల్ కార్యాలయంలోనే ఓ మూలకు పడి ఉన్నాయని కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి అన్నారు. కంప్యూటర్లు పాడవ్వడంతో గత రెండు నెలల నుంచి కంప్యూటర్ తరగతులు సరిగా జరగక విద్యార్థులు నష్టపోతుండటంతో మరోసారి కమిషనర్ ను అడగగా మీరు ఎవరికైనా ఫిర్యాదు చేసుకోండి అని కమిషనర్ అంటున్నాడని ప్రిన్సిపాల్ అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో రేపటి నుంచి జరగబోయే ప్రాక్టికల్ పరీక్షలకు విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది.
గురువారం వరకు కంప్యూటర్లను అప్పగిస్తాం
ఈ విషయమై కమిషనర్ శ్రీకాంత్ ను వివరణ కోరగా కంప్యూటర్లు చెడిపోయింది వాస్తవమేనని, రిపేర్ కోసం హైదరాబాద్ పంపించామని గురువారం లోపు కంప్యూటర్లను బాగు చేయించి కళాశాలకు అప్పగిస్తామని అన్నారు.






