- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పత్తి కొనుగోలు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదు : బీఆర్ఎస్
దిశ, జడ్చర్ల : పత్తి కొనుగోలు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు మంగళవారం

దిశ, జడ్చర్ల : పత్తి కొనుగోలు పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తగదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి దిక్కులేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం పత్తి రైతులకు శాపంగా మారిందని పేర్కొన్నారు. ప్రతి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని లక్షల మంది రైతన్నలు తమ పత్తిని కొనుగోలు చేసే దిక్కు లేక ఆందోళన చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కనీసం స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. రైతులకు అండగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి సిసిఐ నిబంధనలను సడలించి రైతుల వద్ద మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కోడికల్ యాదయ్య, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పిట్టల మురళి, బీఆర్ఎస్ నాయకులు ప్రనిల్ చందర్, శంకర్ నాయక్, ఇంతియాజ్, కొండల్, రవి నాయక్, సాగర్, కరాటే శ్రీను, రఫీ, పత్తి రైతులు పాల్గొన్నారు.






