- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదు : కలెక్టర్ విజయేందిర బోయి
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. గురువారం ఆమె కోయిల్ కొండ పిహెచ్ సీ, జడ్పీ ఉన్నత పాఠశాల అనంతరం తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించనని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. గురువారం ఆమె కోయిల్ కొండ పిహెచ్ సీ, జడ్పీ ఉన్నత పాఠశాల అనంతరం తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేస్తూ చికిత్స పొందుతున్న రోగులు, గర్భిణీలతో మాట్లాడి, వారికి అందుతున్న చికిత్స, వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత రిజిస్టర్లలో నమోదు సక్రమంగా లేనందున ఆగ్రహం వ్యక్తంచేసి, ఇకపై నమోదు సక్రమంగా లేకుంటే కఠినచర్యలు చేపడతానని హెచ్చరించారు. రోజూ ఎన్ని డెలివరీ లు జరుగుతున్నాయని, మందుల సరఫరా గురించి అడిగి తెలుసుకున్నారు. మందుల కొరత ఉందని అక్కడ ఉన్న సర్పంచ్ తెలిపారు. వెంటనే డిఎం అండ్ హెచ్ఓ తో మాట్లాడి మందుల సరఫరా చేయాలని ఆదేశించారు. అనంతరం జడ్పీ హైస్కూల్ తనిఖీ చేసి ఉపాద్యాయులు ఎఫ్ఆర్ఎస్ యాప్ వినియోగం గురించి ప్రశ్నించారు. బయోమెట్రిక్ విధానంలో హాజరు నమోదు చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.మధ్యహ్న భోజనం తనిఖీ చేశారు. విద్యార్థులతో భోజనం గురించి అడుగగా, భోజనం బాగాలేదని తెలుపగా, నాణ్యత గల మధ్యాహ్న భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తదుపరి తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించి, పెండింగ్లో ఉన్న ఫైళ్లను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో కొయిలకొండ తహసిల్దార్ రాజా గణేష్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






