ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించను : కలెక్టర్ విజయేందిర బోయి

by Ratna Kumari |   (  Updated:2025-12-10 15:08:06  IST  )

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలే

ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించను : కలెక్టర్ విజయేందిర బోయి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదిలేదని కలెక్టర్ విజయేందిర బోయి హెచ్చరించారు. బుధవారం ఆమె గండీడ్ మండలంలో విశ్వభారతి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను సందర్శించి, పోలింగ్ బృందాలకు సామాగ్రి పంపిణీ పర్యవేక్షించారు. ఉదయం10.30 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకున్న సమయంలో జోనల్ అధికారిగా నియమించిన పంచాయతీ రాజ్ ఏఈ గండీడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు రాకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం కారణంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. ఎన్నికల విధుల్లోని అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

Next Story