- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పటిష్ట భద్రత నడుమ 'నీట్' పరీక్షలు
ఆదివారం నిర్వహించిన 'నీట్(యూజి)' పరీక్షల కోసం జడ్చర్లతో సహా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : ఆదివారం నిర్వహించిన 'నీట్(యూజి)' పరీక్షల కోసం జడ్చర్లతో సహా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను ఆమె స్వయంగా పరిశీలించి మాట్లాడారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పలు సూచనలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జానకి ఆదేశించారు. టూ టౌన్ సీఐ ఇజాజొద్ధీన్, తదితర పోలీస్ అధికారులు ఆమె వెంట ఉన్నారు.
'నీట్' పరీక్షలకు 4141 అభ్యర్థులు హాజరు
మహబూబ్‌నగర్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి 'నీట్' మెడికల్ ప్రవేశ పరీక్ష ఎలాంటి అవాంతరాలు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 12 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 4,214 మంది అభ్యర్థులకు 4,141 మంది హాజరయ్యారు. 73 మంది అభ్యర్థులు గైర్హాజరయినట్లు అధికారులు వెల్లడించారు.






