- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూన్ 20న జాతీయ లోక్ అదాలత్
జిల్లా ప్రజలకు సత్వర, సులభ తక్కువ ఖర్చుతో కూడిన న్యాయ పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు.

దిశ, గద్వాల క్రైం : జిల్లా ప్రజలకు సత్వర, సులభ తక్కువ ఖర్చుతో కూడిన న్యాయ పరిష్కారాన్ని అందించే లక్ష్యంతో జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు ఎస్పీ టి. శ్రీనివాసరావు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల కేసులు, ట్రాఫిక్ చలానాలు, రాజీకి అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు సివిల్ వివాదాలను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియ నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, సమయం, డబ్బు ఆదా అవుతాయని, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా ముగించుకోవడానికి ఇది ఉత్తమ వేదిక అని వివరించారు. ప్రజలు తమ కేసులకు సంబంధించిన వివరాలను సంబంధిత కోర్టులు, న్యాయవాదులు లేదా పోలీసు అధికారులను సంప్రదించి లోక్ అదాలత్‌లో పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అవగాహనతో తమ వివాదాలను ముగించుకోవాలని ఎస్పీ కోరారు.






