జాతీయస్థాయి కబడ్డీ టీంకు సి. చందన ఎంపిక

by Ratna Kumari |   (  Updated:2025-10-24 14:48:43  IST  )

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) 8వ తరగతి విద్యార్థిని సి. చందన అండర్‌–14

జాతీయస్థాయి కబడ్డీ టీంకు సి. చందన ఎంపిక
X

దిశ, మహమ్మదాబాద్ : మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) 8వ తరగతి విద్యార్థిని సి. చందన అండర్‌–14 విభాగంలో ప్రతిభ చూపి జాతీయస్థాయి కబడ్డీ టీంకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని పటాన్‌చెరువులో ఇటీవల నిర్వహించిన 69వ ఎస్‌.జి‌.ఎఫ్‌ (School Games Federation) రాష్ట్రస్థాయి అండర్‌–14 కబడ్డీ పోటీల్లో చందన తెలంగాణ రాష్ట్రం తరఫున మొదటి స్థానం సాధించి ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామోహన్‌రెడ్డి విద్యార్థిని చందనను పాఠశాల పిడి అబ్దుల్ బిన్ అహ్మద్ ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో చందన అద్భుత ప్రదర్శన చూపి ఇండియా టీమ్‌లో స్థానం సంపాదించడం గర్వకారణమని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తున్నదని, విద్యా–ఉద్యోగాల్లో క్రీడాకారులకు రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. సురేందర్‌రెడ్డి పాఠశాలకు అవసరమైన సౌకర్యాల గురించి ఎమ్మెల్యే గారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహమ్మదాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం. నారాయణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కమతం విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ కో ఆప్షన్ నెంబర్ ఈసా బస్రావి,పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. సురేందర్‌రెడ్డి, పి.డి. అబ్దుల్ బిన్ అహ్మద్, సి. హనుమంతు, జి. లక్ష్మి కాంత్ రెడ్డి, బి సత్యయ్య, ఎస్ కేశవులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story