- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ మహిళా కార్మికులకు ఘనంగా సన్మానం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులను పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు

దిశ, కొల్లాపూర్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కార్మికులను పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. వాసవి కింగ్స్,వాసవి వనిత, అవోపా,క్లాస్ మెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళాలకు చీరలు పంపిణీ చేశారు. పట్టణ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు తోపాటు.. వాసవి వనిత సంఘం నాయకురాళ్లు శ్రీదేవి,కుసుమ,రాధిక,సరిత,కట్టా శ్రీదేవి,హరిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పట్టణానికి చెందిన నిరుపేద మైనార్టి మహిళకు కుట్టు మిషన్,అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న బాలిక పల్లవికి వారు కొంత నగదును అందజేశారు.అలాగే పట్టణంలోని మహిళా ఉపాధ్యాయినిలను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
అలాగే పట్టణంలో శ్రీవాణి విద్యాలయంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రంగినేని జగదీశ్వరుడు ఆధ్వర్యంలో మహిళలను ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ..తిర్ణాంపల్లి,మొలచింత పల్లి,మారేడుమాన్ దీన్నే,యాపట్ల,మరికల్,పెద్ద కార్పాముల,అమరగిరి గూడే లకు చెందిన ఆదివాసి మహిళలు నార్లా పూర్ గూడెంలో మహిళా దినోత్సవం సందర్బంగా ర్యాలీ నిర్వహించారు.






